Showing posts with label Annamacharya Keerthanalu. Show all posts
Showing posts with label Annamacharya Keerthanalu. Show all posts

Saturday, November 5, 2011

Antharyami Alasithi Solasithi (అంతర్యామి అలసితి) - Annamacharya Keerthanalu Lyrics in telugu

అన్నమాచార్య సంకీర్తనలు

Click to Play:

రాగం: ఆభోగి

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

Annamacharya Songs lyrics in telugu

antaryami alasiti solasiti
inthata nee sharanide jochhitini

korina korkulu koyani katlu
teeravau neevavi tenchaka
bharapu baggalu paapa punyamulu
nerupula boneevu neevu vaddanaka

janula sangamula jakka raogamulu
vinu viduvavau neevu vidipinchaka
vinayapu dainyamu viduvani karmamu
chanadadi neevitu shantaparachaka

madilo chintalu millu manugulu
vadalavu neevavi vaddanaka
edutane shree venkateswara neevade
adana gachithivi attittanaka

Brahma Kadigina Padamu (బ్రహ్మగడిగిన పాదము) - Annamacharya Keerthana Lyrics

అన్నమాచార్య సంకీర్తనలు
Click to play:
బ్రహ్మగడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మగడిగిన పాదము

చెలగి వసుధ గొలిచిన దీ పాదము బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదముపామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరిపరి విధముల వర మొసగెడి నీ పాదము
తిరు వేంకటగిరి తిరమని చూపినపరమ పదము నీ పాదము

Lyrics of Annamacharya Keerthanalu

brahmagadigina padamu
brahmamu tane nee padamu
brahmagadigina padamu

chelagi vasudha golichina di padamu bali tala mopina padamu
talakaka gaganamu tannina padamu balaripu gaachina padamu

kaamini paapamu kadigina padamu paamu tala nidina padamu
premapu sreesati pisikedi padamupamidi turagapu padamu

parama yogulaku paripari vidhamula vara mosagedi nee padamu
tiru venkatagiri tiramani choopinaparama padamu nee padamu

anthayu neeve (అంతయు నీవే హరి ) keerthana lyrics in telugu

అన్నమాచార్య సంకీర్తనలు

Click to Play:
Ragam: Hindholam
Thalam: Aadhi
Arohana: Sa Ga Ma Da Ni Sa
Avarohana: Sa Ni Da Ma Ga Sa

అంతయు నీవే హరి పుండరీకాక్ష - చెంతనాకు నీవే శ్రీరఘురామ …… 2
అంతయు నీవే హరి పుండరీకాక్ష

కులమును నీవే గోవిందుడా నా - కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా - నెలవును నీవే నీరజనాభ

తనువును నీవే దామోదర నా - మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా - వెనకముందు నీవే విష్ణు దేవుడా

పుట్టుగు నీవే పురుషోత్త మ - కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు - నెట్టన గతి ఇంక నీవే నీవే

Anthayu Neeve Keerthana Lyrics in English

Anthayu neeve hari pundareekaaksha - chenthanaaku neeve Sreeraghuraama …… 2
Anthayu neeve hari pundareekaaksha

Kulamunu neeve govindudaa naa - Kalimiyu neeve karunaanidhi
Talapunu neeve dharaneedhara naa - Nelavunu neeve neerajanaabha

Tanuvunu neeve daamodara naa - Manikiyu neeve madhusoodana
Vinikiyu neevae vitthaludaa naa - Venakamundu neevae vishnu daevudaa

Puttugu neeve purushotta ma - Kona nattanadumu neeve naaraayana
Ittae Sree Venkateshwarudaa naaku - Nettana gathi inka neeve neeve

anni mantramulu inde (అన్ని మంత్రములు ఇందె ఆవహించెను) annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు

అన్ని మంత్రములు ఇందె ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము

నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము

రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

Anni Mantramulu Inde Keerthana Lyrics in English

Anni mamtramulu inde aavahinchenu - vennatho naaku kalige venkataesu mantramu

Naaradudu japiyinche naaraayana mantramu - chaere prahlaadudu naarasimha mantramu
Kori vibheeshanudu chaekone raama mantramu - vaerenaaku galige vaenkataesu mantramu

Ramgagu vaasudaeva mamtramu dhrvumdu japimche - angavimche krshna mantramu arjunudu
Mumgita vishnu mamtramu mogiSukudu pathimche - vimgadamai naaku nabbe vaenkataeSu mantramu

Inni mantramula kella imdiranaathude guri - pannina nidiyae parabrahma mantramu
Nannu gaavagaligaebo naaku gurudiyyagaanu - vennela vantidi Sreevaemkataesu mantramu

bhavamulona bhahyamunandunu (భావములోన బాహ్యమునందును) - annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు
పల్లవి:
భావములోన బాహ్యమునందును
గోవిందగోవిందయని కొలువవో మనసా

చరణం1:
హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు
హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
హరిహరి హరిహరి యనవోమనసా

చరణం2:
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
విష్ణువు విష్ణువని వెదకవో మనసా

చరణం3:
అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
అచ్యుత అచ్యుత శరణనవో మనసా

Bhavamulona Bhahyamunandunu Keerthana Lyrics in English

Pallavi:
Bhavamulona bhahyamunandunu
Govinda govinda ani koluvavo manasA ...

Charanam1:
Hari avatharamule akhila devathalu - Harilonive brahmandambulu
Hari naamamule anni manthramulu - Hari hari hari hari hari anavo manasa …
Hari hari hari hari hari anavo manasa …

Charanam2:
Vishnuni mahimale vihitha kharmamulu - Vishnuni pogadedi vedambulu
Vishnudokkade vishwantharathmudu - Vishnuvu vishnuvani vedakavo manasA …
Vishnuvu vishnuvani vedakavo manasA …

Charanam3:
Achyuthudithade Aadiyu nanthyamu - Achyuthude asuranthakudu
Achyuthudu Sri venkatadrimeedanide - Achyutha Achyutha Sharananavo manasA …
Achyutha Achyutha Sharananavo manasA …

vinaro bhagyamu vishnukatha (వినరో భాగ్యము విష్ణుకథ) - annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు

Click to play song:

పల్లవి:
వినరో భాగ్యము విష్ణుకథ - వెనుబలమిదివో విష్ణు కథ

చరణం1:
ఆదినుండి సంధ్యాదివిధులలో - వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే - వీదివీధులనే విష్ణుకథ

చరణం2:
వదలక వేదవ్యాసులు నుడివిన - విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్థనయై - వెదకినచోటనే విష్ణుకథ

చరణం3:
గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ - వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము - వెల్లిగొలిపె నీవిష్ణుకథ.

Vinaro Bhagyamu Vishnukatha Keerthana Lyrics in English

Pallavi:
Vinaro bhagyamu vishnukatha - Venubalamidivo vishnu katha

Charanam1:
Adinundi sandhyadividhulalo - vedambayinadi vishnukatha
Nadincheenide naradadulache - veediveedhulane vishnukatha

Charanam2:
Vadalaka vedavyasulu nudivina - viditapavanamu vishnukatha
Sadanambainadi sankeerthanayai - vedakinachotane vishnukatha

Charanam3:
Golletalu challagonakoni chilukaga - vellaviriyaya vishnukatha
Yillide shree venkateshwarunamamu - velligolipenee vishnukatha

narayanathe namo namo (నారాయణతే నమో) - annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు

Click to Play:
పల్లవి:
నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో

చరణం1:
మురహర భవహర ముకుంద మాధవ - గరుడగమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన - నరమృగ శరీర నమో నమో ..

చరణం2:
జలధి శయన రవిచంద్ర విలోచన - జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోప వధూ వల్లభ - నలినోదరతే నమో నమో ..

చరణం3:
ఆదిదేవ సకలాగమ పూజిత - యాదవకుల మోహన రూప
వేదోద్చర వేదోద్దర శ్రీ వేంకటనాయక - నాద ప్రియతే నమో నమో ..

Narayanathe Namo Namo Keerthana Lyrics in English

Pallavi:
narayanathe namo namo - bhava narada sannuta namo namo

Charanam1:
Murahara bhavahara mukunda madhava - garuda gamana pankajanabha
Parama purusha bhavabandha vimochana - naramruga sharIra namo namo ..

Charanam2:
Jaladhi shayana ravicandra vilocana - jalaruha bhavanutha charanayuga
Bhali bandhana gopavadhu vallabha - nalinodharathe namo namo ..

Charanam3:
Adi deva sakalagama pujitha - yadava kula mohanarupa
Vedodhara Sri venkatanayaka - nada priyathe namo namo....

srimannarayana srImannarayana (శ్రీమన్నారాయణ) - annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు
పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు

చరణం1:
కమలాసతీ ముఖ కమల కమలా హిత
కమల ప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు

చరణం2:
పరమ యోగిజన భాగధేయ శ్రీ
పరమ పూరుష పరాత్పరా …
పరమాత్మా పరమనురూప శ్రీ
తిరువేంకటగిరి దేవా శరణు

SrImannarayana SrImannarayana Lyrics in English

Pallavi:
ShrImannarayana shrImannarayana
ShrIman narayananI shrI paadame sharanu

Charanam1:
Kamalasathi mukha kamala kamala heetha
Kamala priya kamalekshana
Kamalasanahita garudagamana shri
Kamalanabha nee padakamalame sharanu

Charanam2:
Parama yogijana bhagadheya shri
Paramapoorusha paratpara
Paramatma paramanuroopa shri
Thiruvenkatagiri idevaa sharanu

hari neeve sarvaathmakudavu (హరి నీవే సర్వాత్మకుడవు ) keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు
పల్లవి:
హరి నీవే సర్వాత్మకుడవు - యిరవగు భావన యియ్యగదే

చరణం1:
చూడక మానవు చూచేటి కన్నులు - యేడ నేవైనా యితరములు
నీడల నింతా నీ రూపము లని - యీడు వడని తెలివియ్య గదే

చరణం2:
పారక మానదు పాపపు మనసిది - ఈ రసములతో నేన్దైనా
నీరజాక్ష యిది నీ మయమేయని - ఈ రీతుల తలపియ్య గదే

చరణం3:
కలుగక మానవు కాయపు సుఖములు - యిల లోపల గల వెన్నైనా
అలరిన శ్రీ వెంకటాధి ప నీకే - యిల నర్పితమను యిహ మియ్య గదే

Hari Neeve Sarvaathmakudavu Lyrics in English

Pallavi:
hari neeve sarvaathmakudavu - yiravagu bhavana yiyyagade

Charanam1:
choodaka maanavu choochaeti kannulu - yeda nevaina itaramulu
needala ninta nee roopamu lani - yeedu vadni teliviyya gade

Charanam2:
paraka mandhu pappu manasidi - ee rasamulato nendaina
neerajaaksha idi nee mayameyani - ee reetula talapiyya gade

Charanam3:
kalugaka maanavu kaayapu sukhamulu - ila lopala gala vennaina
alarina shree venkatadhi pa neeke - ila narpitamanu iha miyya gade

vedukondama(వేడుకొందామా) annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు
పల్లవి:
వేడుకొందామా వెంకటగిరి వేంకటేశ్వరుని

చరణం1:
ఆమటి మ్రొక్కుల వాడే ఆది దేవుడే
వాడు తోమని పళ్యాలవాడే దురిత దూర్యుడే

చరణం2:
వడ్డీ కాసులవాడే వనజనాభుడే
పుట్టు గొడ్రాళ్ళకు బిడ్డ లిచ్చే గోవిందుడే

చరణం3:
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగా శ్రీ వేంకటాద్రి నాధుడే

Vedukondama Keerthana Lyrics in English

Pallavi:
vedukondaama venkatagiri venkateshwaruni

Charanam1:
amati mrokkula vaade adi devude
vadu tomani palyalavade durita dooryude

Charanam2:
vaddee kasulavade vanajanaabhude
puttu godrallaku bidda lichhe govindaude

Charanam3:
yelimi koririna varaalichhe devude
vadu alamelmamga shree venkatadri naadhude

muddugare yashoda(ముద్దు గారే యశోద ) keerthana lyrics in telugu

అన్నమాచార్య సంకీర్తనలు

Click to Play :
పల్లవి
ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

చరణం1:
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

చరణం2:
రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు

చరణం3:
కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె దిరిగే పద్మనాభుడు

Muddugare Yashoda Keerthana Lyrics in English

pallavi
Muddu gAre YashodA mungita muthyamu veedu
Diddaraani mahimala Devaki suthudu

Charanam1:
Anthanintha gollethala arachethi manikyamu
Panthamaade Kamsuni pali vajramu
Kaanthula moodu lokala Garudapachhaapoosa
Chenthala malonunna Chinni Krishnudu

Charanam2:
rathikeli rukhminiki rangumovi pagadamu
mithi govardhanapu Gomedhikamu
sathamai Shankhachakrala sandula vaidhooryamu
gathiyai mammu gAche Kamalakshudu

Charanam3:
kalinguni thalalapai gappina pushyaragamu
yeleti Sri Venkatadri Indraneelamu
paalajalanidhilona bayani Divya ratnamu
baaluneevale dirige Padmanabhudu

nanati batuku(నానాటి బ్రతుకు నాటకము) - annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు
పల్లవి
నానాటి బ్రతుకు నాటకము
కానక కన్నది కైవల్యము

చరణం1:
పుట్టుటయు నిజము, పోవుటయు నిజము,
నట్ట నడి మీ పని నాటకము
ఎట్ట నెదుట గలదీ ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము

చరణం2:
కుడిచే దన్నము, కోక చుట్టెడిది,
నడమంత్రపు పని నాటకము;
ఒడి గట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము

చరణం3:
తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువలె శ్రీ వేంకటేశ్వరు డేలితే
గగనము మీదిది కైవల్యము

Nanati Batuku Keerthana Lyrics in English

pallavi
naanaati bratuku natakamu
kanaka kannadi kaivalyamu

Charanam1:
puttutayu nijamu povutayu nijamu
natta nadi mee pani natakamu
yetta neduta galadi prapanchamu
katta kadapatidi kaivalyamu

Charanam2:
kudiche dannamu koka chuttedidi
nadamantrapu pani natakamu
odi gattukonina ubhaya karmamulu
gadi datinapude kaivalyamu

Charanam3:
tegadhu paapamu teeradhu punyamu
nagi nagi kaalamu natakamu
yeguvale shree venkateshvaru delithe
gaganamu neekidi kaivalyamu

govindashrita gokula brinda (గోవిందాశ్రిత గోకులబృందా) keerthana lyrics in telugu

అన్నమాచార్య సంకీర్తనలు

Click to play:
పల్లవి
గోవిందాశ్రిత గోకులబృందా పావన జయజయ పరమానంద

చరణం1:
జగధభిరామ సహస్ర నామ సుగుణధామ సంస్కృత నామ
గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ

చరణం2:
జననుత చరణా శరణ్యు శరణా దనుజ హరణ లలిత స్వరణా
అనఘ చరణాయుత భూభరణా దినకర సన్నిభ దివ్యాభరణా

చరణం3:
గరుడ తురంగా సారోత్తుంగా శరధి భంగా ఫణిశయనాంగా
కరుణాపాంగా కమలా సంగా వర శ్రీవేంకట గిరిపతి రంగా

Govindashrita Gokula Brinda Lyrics in English

pallavi
govindashrita gokulabrundha pavana jayajaya paramananda

Charanam1:
jagadhabhirama sahasra naama sugunadhama samskruta naama
gaganashyaama ghanaripu bheema aganita raghuvanshanbudhi soma

Charanam2:
jananuta charana sharanayu sharana danuja harana lalita svarna
anagha charanayuta bhoobharana dinakara sannibha divyabharana

Charanam3:
garuda turamga sarottunga sardhi bhanga phanishayanamga
karunapamga kamala samga vara sreevenkata giripati ranga

kondalalo nelakonna(కొండలలో నెలకొన్న కోనేటి రాయడు) - annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు
Click to Play:
పల్లవి
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు....

చరణం1:
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల యిచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండ మాన్ చక్కుర వర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు..

చరణం2:
అచ్చపు వేడుకతోడ అనంతాళు వారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు..

చరణం3:
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు

Kondalalo Nelakonna Keerthana Lyrics in English

pallavi
kondalalo nelakonna koneti raayadu vadu
kondalamta varamulu guppedu vadu....

Charanam1:
kummara dasudaina kuruvaratinambi
yimmanna varamulella yichhina vadu
dommulu sesina yatti tonda man chakkura varti
rammanna chotiki vachhi nammina vadu..

Charanam2:
achhapu vedukatoda anantaalu vaariki
muchchili vettiki mannu mocina vadu
machhika dolaka dirumalanambi todutha
nicchanichha matladi naochhina vadu..

Charanam3:
kanchilonunda tirukachhinambi meeda
karuninchi tanayedaku rappinchina vadu
yenchi yekkudaina venkateshudu manalanu
manchivaadai karuna paalinchinavadu

adivo alladivo (అదివో అల్లదివో శ్రీహరివాసము) - annamacharya keerthana lyrics

అన్నమాచార్య సంకీర్తనలు

Click to Play:
రాగం: మధ్యమావతి రాగం
తాళం: ఆది తాళం

పల్లవి:
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము

చరణం1:
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిలమునులకు
అదే చూడుడు, అదే మ్రొక్కుడు
అదే చూడుడదే మ్రొక్కుడానందమయము

చరణం2:
చెంగటనల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

చరణం3:
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటాపతికి సిరులైనవి
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము

Adivo Alladivo Keerthana Lyrics in English

Pallavi:
adivo alladivo shreeharivaasamu
padivela sheshula padagalamayamu

Charanam1:
ade venkataachala makhilonnathamu
adivo brahmaadula kapuroopamu
adivo nithya nivaasa makhilamunulaku
ade choodudu, ade mrokkudu
ade choodu dade mrokkudaanandamayamu

Charanam2:
chengatanalladivo sheshaachalamu
ninginunna devathala nijavaasamu
mungita nalladivo moolanunna dhanamu
bhangaaru sikharaala bahu brahmamayamu

Charanam3:
kaivalyapadamu venkatanagamadivo
shreevenkataapathiki sirulainavi
bhaavimpa sakala sampadaroopa madivo
paavanamulakella paavanamayamu

pidikita talambrala pendli koothuruపిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు) - annamacharya keerthanalu lyrics in telugu

అన్నమాచార్య కీర్తన

Click to Play Song:

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత
పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు

పేరుకల జవరాలె పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు

పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు
నేడె పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను
వడి నెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు

Pidikita Talambrala Pendli Koothuru - Annamacharya Sankeerthana Lyrics

pidikita thalambraala pendli koothuru kontha
pedamarane navvene pendli koothuru

perugala javaraalee pendli koothuru
pedda peruna muthayala meda pendli koothuru
perantandla nadimi pendli koothuru
vibhu peru guchhu siggu pade pendli koothuru

pettene pedda thurumu pendli koothuru
nedu pettedu cheeralu katte pendli koothuru
gattigaa venkatapathi kougitanu
vadi nettina nidaanamaina pendli koothuru

Jagadapu chanavula jajara(జగడపు చనువుల జాజర)- annamacharya sankeerthana in telugu

అన్నమాచార్య సంకీర్తనలు

Raagam : Hindholam
Thaalam : Aaadi Thaalam

జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర

మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర

భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర

బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమ దంబుల జాజర

Jagadapu Chanavula Jajara - Annamacharya Keerthana Lyrics

Jagadapu chanavula jajara saginala manchapu jaajara

mollalu thurumulu mudichina bharuvuna
mollalu sarasapu muripemuna
jallina puppodi jaaraga pathipai jallerathivalu jaajara

bhaarapu kuchamula pai pai kadu singaaramu nerapati ghanda vodi
cheruva pathipai chindaga padathulu saareku challeru jaajara

binkapu kootami penageti chematala pankapu bhoothala[arimalamu
venkatapathipai velathulu nincheru sankumadanthula jaajara

jaya mangalamu neeku (జయమంగళము నీకు సర్వేశ్వర) - annamacharya keerthanalu lyrics in telugu

అన్నమాచార్య సంకీర్తనలు
Click to Play:
జయమంగళము నీకు సర్వేశ్వర
జయమంగళము నీకుజలజవాసినికి

శరణాగతపారిజాతమా పొరి నసురలపాలిభూతమా
అరుదైనసృష్టికి ఆదిమూలమా ఓహరి నమో పరమపుటానవాలమా

సకలదేవతాచక్రవర్తి వెకలిపై నిండినవిశ్వమూర్తి
అకలంకమైనదయానిధి వికచముఖ నమో విధికివిధి

కొలిచినవారలకొంగుపైడి ములిగినవారికి మొనవాడి
కలిగినశ్రీవెంకటరాయా మలసి దాసులమైనమాకు విధేయా

Jaya Mangalamu Neeku - Annamacharya Sankeerthana Lyrics

jaya mangalamu neeku sarveshwara
jayamangalamu neekujalajavaasiniki

sharanagataparijatama pori nasuralapalibhootama
arudayina srushtiki adimoolama vo hari namo paramaputanavalama

sakaladevatachakravarti vekalipai nindinavishwamoorti
akalamkamainadayanidhi vikachamukha namo vidhikividhi

kolichinavaralakongupaidi muliginavariki monavadi
kaliginasreevenkataraya malasi dasulamainamaaku vidheya

ఇందరికీ అభయంబులిచ్చు(indariki Abhayambulichu) annamacharya keerthanalu lyrics in telugu

ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి

వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి

తనివోక బలి చేత దానమడిగిన చేయి ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి

పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలా ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి

Indariki Abhayambu - Annamacharya Sankeerthana Lyrics

indariki abhayambulichhu cheyi kanduvagu manchi bangaru cheyi

velaleni vedamulu vedaki techhina cheyi chiluku gubbali kindha cherchu cheyi
kaliki yagu bhookaanta kougalinchina cheyi valanaina konagolla vadi cheyi

tanivaoka bali cheta danamadigina cheyi onaranga bhoodaana mosagu cheyi
monasi jalanidhi yammumonaku dechhina cheyi yenaya nagelu dhariyinchu cheyi

purasatula maanamulu pollasesina cheyi turagambu barapedi dodda cheyi
tiruvenkatachala dheeshudai maokshambu teruvu pranula kella telipedi cheyi
Related Posts Plugin for WordPress, Blogger...